బిజెపి నిరంకుశ విధానాలపై సిపిఎం నిరసన

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌
ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం చేకూర్చుతున్న బిజెపి నియంతృత్వ విధానాన్ని ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. పార్లమెంట్‌లో దాడి ఘటనపై నోరు మెదపకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు జల్లి రామ్మోహన్‌రావు, పొగాకు నారాయణరావు, పొన్నాడ రాము, పి.అప్పలనాయుడు, వాసా రామలింగం, బుడితి ఇజ్రాయిల్‌, అందే శ్రీను, జగన్‌, నాగరాజు పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్‌ హెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి, పుల్లారెడ్డి, కర్రి సాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు యూనియన్‌ వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్సిబి రెడ్డి, ఆకుల నారాయణ, కడప ఆంజనేయులు, బుద్దాల నాని, మద్దాల పుత్రయ్య, గాది వెంకట్రావు, కృష్ణ యాండ్రపు కృష్ణ పాల్గొన్నారు.

➡️