మది మెచ్చిన మన్మధుడు నవల ఆవిష్కరణ

ప్రజాశక్తి – ఉండి
మది మెచ్చిన మన్మధుడు నవల పుస్తకాన్ని టిడిపి సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంఎల్‌ఎ, శివ స్వచ్ఛంద సేవా సంస్థల అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) ఆవిష్కరించారు. భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఉండి మండలం ఎన్‌ఆర్‌పి అగ్రహారం మాజీ సర్పంచి ప్రియదర్శిని విజయరత్నం కుమారుడు కార్తికేయ రాసిన మది మెచ్చిన మన్మధుడు నవలను శివరామరాజు ఆవిష్కరించారు. తొలి పుస్తకాన్ని ఉండి ఎఎంసి మాజీ ఛైర్మన్‌ సాగిరాజు సాంబశివరాజుకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయిత కార్తికేయ నేటి మానవ సంబంధాలు జీవనశైలి వ్యవహార శైలిపై చక్కగా ఈ నవల రాశారన్నారు. ప్రతిఒక్కరూ ఈ నవలను చదవాలన్నారు. చిన్న వయసులోనే ఎంతో పరిజ్ఞానంతో రచయిత కార్తికేయ తన ప్రతిభను చూపించారన్నారు. ఉండి ఎఎంసి మాజీ ఛైర్మన్‌ సాగిరాజు సాంబశివరాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ పుస్తకాలను చదవాలని, వాటిపై అవగాహన పెంచుకుని, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో రచయిత తాళ్లూరి కార్తికేయ, తాళ్లూరి విజయరత్నం, నడింపల్లి సత్యనారాయణరాజు(సత్తిబాబు), మోపిదేవి శ్రీనివాస్‌, వత్సవాయ సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.

➡️