మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Feb 2,2024 22:38

ప్రజాశక్తి – కొయ్యలగూడెం
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నీరు గారుస్తున్నాయన్నారు. పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. తహశీల్దార్‌ కార్యాలయంలో సమస్యలతో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆశా, కె.కుమారి, అడపా రమాదేవి, రౌతు వరలక్ష్మి, ఎ.కృష్ణవేణి, ఎన్‌.రేణుక, రౌతు బేబీకుమారి పాల్గొన్నారు. నిడమర్రు :మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు డిమాండ్‌ చేశారు. నిడమర్రు ప్రజా సంఘాల కార్యాలయంలో వెంకాయమ్మ అధ్యక్షతన మధ్యాహ్న భోజన కార్మికులు సమావేశం నిర్వహించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని ఎంఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంఇఒ రాంబాబకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వరప్రసాద్‌, మైలవరపు నాగలక్ష్మి, కోరాడ వెంకటరమణ, యాల సత్యవతి, జ్యోతి, పి.గంగాభవాని, చోడవరం పద్మ, పి.నాగగంగాభవాని, పెద్దిరెడ్డి సూర్యకాంతం పాల్గొన్నారు.

➡️