మీ అబ్బాయికి కలలో చెప్పండి

వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు అంగన్‌వాడీల వినతులు – 21వ రోజు కొనసాగిన సమ్మె

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె స్ఫూర్తితో అనేక ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం, పిఎస్‌.విజయరామరాజు తెలిపారు. సోమవారం అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో 21వ రోజు సమ్మె కొనసాగింది. శిబిరం వద్ద రామభద్రం, విజయరామరాజు మాట్లాడారు. అనంతరం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.మీ అబ్బాయి జగన్‌ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు కలలోనైనా చెప్పండి అన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కళ్యాణి, విజయలక్ష్మి, యుటిఎఫ్‌ గౌరవాధ్యక్షులు ఎం.మార్కండేయులు, జిల్లా కోశాధికారి సిహెచ్‌ పట్టాభి, సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.వీరవాసరం:తమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని తుడిచేయడం ఖాయమని అంగన్‌వాడీలు నినదించారు. సోమవారం సమ్మె 21వ రోజుకు చేరిన నేపథ్యంలో చీపురు పట్టి రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్‌.అశ్రియ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, అంగన్‌వాడీ నాయకులు పి.నాగరత్నం, సత్యవతి, శాంతికుమారి, నాగ పార్వతి, వెంకటలక్ష్మి నాయకత్వం వహించారు.కాళ్ల : 21 రోజుల నుంచి అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టనట్టు వ్యవహరించడం దారుణమని సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహించి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ, సిఐటియు మండల కార్యదర్శి మండా సూరిబాబు, యడవల్లి చంద్రావతి, ఝాన్సీరాణి, దవులూరి మార్తమ్మ పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : అంగన్‌వాడీల దీక్షలు కొనసాగాయి. ఈ మేరకు పెనుమంట్ర మార్కెట్‌ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి అంగన్‌వాడీ కార్యకర్తలు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం ఆటపాటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో మార్టేరు, పెనుమంట్ర, ఆలమూరు సెక్టార్‌ నాయకులు సాయి మహాలక్ష్మి, మౌనిక పాల్గొన్నారు.పోడూరు : అంగన్‌వాడీలు సోమవారం 21వ రోజు దీక్షా శిబిరం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కవిటంలోని వైఎస్‌ఆర్‌ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, సిఐటియు నాయకులు పిల్లి ప్రసాద్‌, బూరాబత్తుల వెంకట్రావు, జె.ఉమాదేవి పాల్గొన్నారు.ఆచంట : ఆచంట కచేరీ సెంటర్లో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద గంటసేపు ధర్నా నిర్వహించి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సమ్మెకు సిఐటియు మండల కార్యదర్శి వర్ధిపర్తి అంజిబాబు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు మైలే విజయలక్ష్మి, మహేశ్వరి, జి.కమల, పద్మ, అల్లం సత్యవతి పాల్గొన్నారు.పాలకొల్లు : అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. ఈ మేరకు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, ఎం.శ్రీదేవి, బి.నాగలక్ష్మి, పి.పద్మావతి పాల్గొన్నారు.తణుకు రూరల్‌ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ విగ్రహానికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామన మునిస్వామి, అంగన్‌వాడీ కార్మికులు వసంతకుమారి, ప్రమీల, దుర్గాదేవి, ఎం.రోజా పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. స్థానిక స్టీమర్‌ రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకుని మీ అబ్బాయి జగన్మోహన్‌ రెడ్డి కల్లోకి వెళ్లి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పాలని అంగన్‌వాడీలు విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము, అంగన్‌వాడీ నాయకులు ఎ.నీలిమ, జి.శ్రీలక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.గణపవరం : 21వ రోజు అంగన్‌వాడీలు వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కాటుక ఝూన్సీలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి ఎమ్‌డి హసీనాబేగం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బి.రామకోటి, ధనలక్ష్మి, కళ్యాణి, కెవి.మహాలక్ష్మి పాల్గొన్నారు.ఉండి : వైఎస్‌ఆర్‌ విగ్రహానికి అంగన్‌వాడీలు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు చైతన్య, కుసుమ, సత్యవేణి, ఝాన్సీ మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.మొగల్తూరు : అంగన్‌వాడీలు రోడ్లపైకొచ్చి రోజుల తరబడి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ విమర్శించారు. అంగన్‌వాడీల దీక్షలు 21వ రోజు కొనసాగాయి. జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనలు మార్చాలని కోరుతూ తండ్రి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. పెద్దింట్లు, సారమ్మ, సీత, నాగలక్ష్మి, రేఖ శాంభవి పాల్గొన్నారు.పెనుగొండ : జగన్‌కు జ్ఞానోదయం అయ్యేలా మీరే కలలో చెప్పాలని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. ముందుగా ప్రదర్శనగా అంగన్వాడీల శిబిరం నుంచి పెనుగొండ మెయిన్‌ రోడ్డు గుండా కాలేజీ సెంటర్లోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలతో పాటు సిఐటియు నాయకులు మాదాసు నాగేశ్వరరావు, నాగిశెట్టి గంగారావు, ఎస్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.పాలకోడేరు : అంగన్‌వాడీల సమ్మె 21వ రోజు కొనసాగింది. స్థానిక సచివాలయం వద్ద ఉన్న రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి అంగన్వాడీలు వినతిపత్రం అందజేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు విమల, విజయలక్ష్మి, విమల కుమారి పాల్గొన్నారు.

➡️