యుటిఎఫ్‌ టెస్ట్‌ పేపర్స్‌ అందజేత

Dec 19,2023 19:02

ప్రజాశక్తి – అత్తిలి
యుటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి యుటిఎఫ్‌ టెస్ట్‌ పేపర్స్‌ని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి కొమ్మర హైస్కూల్‌ హెచ్‌ఎం జొన్నాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పని చేస్తున్న కొమ్మర ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులందరికి సుమారు రూ.మూడు వేల విలువైన టెస్ట్‌ పేపర్స్‌ ఉచితంగా తన సొంత ఖర్చులతో అందించారు. వారికి మండల శాఖ పక్షాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉద్యమ అభినందనలు తెలిపారు. గోపీమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మెటీరియల్‌ బాగా చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకత్వం, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️