లారీ ఢకొీని ఇద్దరు దుర్మరణం

ప్రజాశక్తి – మొగల్తూరు

ట్రక్కు ఆటోను లారీ ఢకొీన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై దారతిప్ప వద్ద సోమవారం అర్థరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామానికి చెందిన యల్లమిల్లి రవికుమార్‌ (30), పొలిమాటి శ్రీను(40) కోడిపుంజులు ఉంచేందుకు తయారు చేసి ఐరన్‌ గాబుల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఈ వ్యాపారానికి సంబందించి సోమవారం సాయంత్రం వెలగదుర్రు నుండి రేపల్లెకు ట్రక్కు ఆటోలో బయలుదేరారు. దారతిప్ప వద్దకు మండపేట వైపు వెళ్తున్న లారీ ఆటోను బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రవికుమార్‌, శ్రీను అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌ వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మెరుగైనవైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎం.వీరబాబు తెలిపారు.

➡️