ఇంఛార్జ్‌ రెవెన్యూ ఇనిస్పెక్టర్‌ గెడ్డం శ్రీరాములు, సత్యవతి దంపతుల షష్ఠిపూర్తి

Jun 20,2024 09:00 #gokavaram

ప్రజాశక్తి-గోకవరం:మండల కేంద్రమైన గోకవరం తహశీల్దార్‌ కార్యాలయంలో ఇంఛార్జి రెవెన్యూ ఇనిస్పెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన గెడ్డం శ్రీరాములు, సత్యవతి దంపతులకు కార్యాలయం సిబ్బంది ఘనంగా షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని తహశీల్ధార్‌ హేమకుమారి, డిప్యూటీ తహశీల్దార్‌ అంబటి రజని ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా హన్నా కళాశాల అదినేత డాక్టర్‌ సువర్ణకుమార్‌,తంటికొండ దేవస్థానం మాజీ చైర్మన్‌ బదిరెడ్డి అచ్చన్న దొర, మాజీ ఎంపీటీసీ పులపర్తి బుజ్జి పాల్గన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాములు నిబద్ధతతో క్రమశిక్షణతో తన విధినిర్వహణలో అందరికి అనుగుణంగా వ్యవహరించడంలో మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి శ్రీరాములు అని కొనియాడారు.శ్రీరాములు దంపతులకు సాలువలతో పుష్ప గుచ్చం అందించి జ్ఞాపికను బహుకరించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

➡️