వాలంటీర్ల సేవలు ఎనలేనివి

Feb 22,2024 21:33

డిసిసిబి ఛైర్మన్‌ నరసింహరాజు

ప్రజాశక్తి – ఉండి

వాలంటీర్ల సేవలు ఎనలేనివని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. గురువారం మహదేవపట్నంలో మండల పరిషత్‌ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పివిఎల్‌ నరసింహరాజు పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రశంసించక తప్పదన్నారు. వాలంటరీ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అనంతరం మహదేవపట్నం, చిలుకూరు, వాండ్రం, ఎన్‌ఆర్‌పి.అగ్రహారం, పెదపుల్లేరు, కలిసిపూడి, చెరుకువాడ, అర్తమూరు తదితర గ్రామాల వాలంటీర్లకు సేవా మిత్ర సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలిసిపూడి ఎంపిటిసి దంగేటి రామలింగేశ్వరరావు, పెద్దపుల్లేరు ఎంపిటిసి రాయి రావులమ్మ, మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు ఈది ఎడ్వర్డ్‌ జాన్సన్‌, నాయకులు పాల్గొన్నారు.

➡️