విద్యార్థులకు పుస్తకాలు అందజేత

ప్రజాశక్తి – భీమడోలు
ఉంగుటూరు ఎంఎల్‌ఎ తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలు, అభిమానులు ప్రేమ పూర్వకంగా అందించే వివిధ అంశాలను విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించిన శాసనసభ్యుని కార్యాలయ సూచనలు ఇతరులకు ఆదర్శప్రాయమని భీమడోలు జెడ్‌పిటిసి సభ్యులు తుమ్మగుంట భవానిరంగ, భీమడోలు మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షురాలు పి.సునీతమాన్‌సింగ్‌ తెలిపారు. ఎంఎల్‌ఎ వాసుబాబు పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ఆయన కార్యాలయానికి విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించారు. ఈ క్రమంలో వాటిలో కొన్నింటిని భీమడోలులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు, భీమడోలు సర్పంచి భీమడోలు హైస్కూల్‌తో పాటు భీమడోలు లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రముఖులు రామకుర్తి నాగేశ్వరరావుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

➡️