వెలివెల సర్పంచిగా వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌
మండలంలోని వెలివెల గ్రామం గ్రామ పంచాయతీ సర్పంచిగా కందుల వెంకటేశ్వరరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో వైసిపికి చెందిన ఇద్దరు నాయకులు సర్పంచి పదవికి పోటీపడ్డారు. వారిని వైసిపి నాయకత్వం ఒప్పించి ముందుగా సర్పంచి పదవి చేపట్టిన కెల్ల సింహాచలంకు 25 నెలలు పదవిలో కొనసాగే విధంగా, ఆ తర్వాత 35 నెలలు కందుల వెంకటేశ్వరరావు సర్పంచి పదవిలో కొనసాగే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం తెల్ల సింహాచలం తన సర్పంచి పదవికి రాజీనామా చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచి కందుల వెంకటేశ్వరరావును వైసిపి పాలకొల్లు ఇన్‌ఛార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపీ) అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు మేకశేషు బాబు, వైసిపి ప్రెసిడెంట్‌ గూడూరు వెంకట నరసింహరావు, మన్నే కోటేశ్వరరావు, గుమ్మాపు వరప్రసాద్‌, కందుల నాగేశ్వరరావు, బోడపాటి వెంకట్‌ నారాయణ పాల్గొన్నారు.

➡️