శ్రీ వాసవి ఫార్మసీ కళాశాలకు పురస్కారాలు

              తాడేపల్లిగూడెం :  తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాలకు మూడు విభాగాల్లో ఐఎస్‌ఒ పురస్కారాలు లభించాయని పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు తెలిపారు. కళాశాలలో బుధవారం నిర్వహించిన ఐఎస్‌ఒ పురస్కార కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐఎస్‌ఒ ఆడిట్‌ సంస్థ హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి శివయ్య చేతుల మీదుగా ఈ సర్టిఫికేషన్లను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ భాస్కరరాజు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రత్నాకరరావు, టెక్నికల్‌ డైరక్టర్‌ చెక్కా అప్పారావు పాల్గొన్నారు.

➡️