సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం

30వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారంతో 30వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం స్పందించేవరకూ సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
భీమవరంలో అంగన్‌వాడీల సమ్మెను సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జెఎన్‌వి.గోపాలన్‌, రారు ప్రారంభించారు. సమ్మెకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌, అధ్యక్షులు జిత్తిగ నరసింహ మూర్తి, ఉపాధ్యక్షులు చింతకాయలు బాబూరావు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సంఘం మండల నాయకులు, 108 నాయ కులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ జిల్లా కార్యదర్శి కల్యాణి, అధ్యక్షులు ఝాన్సీ హసీనా, జి.విజయలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌, దుర్గ, మేరీ గ్రేస్‌, మాధవి పాల్గొన్నారు. ఆచంట : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని ఆశా కార్యకర్తల జిల్లా ప్రధాన కార్యదర్శి దిగుపాటి జ్యోతి డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆచంట కచేరి సెంటర్‌లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం 30వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మెకు ఆశా కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆచంట కచేరి సెంటర్‌లో సిఎం డౌన్‌ డౌన్‌, ఎస్మా చట్టాని తక్షణమే రద్దు చేయాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, సిగ్గు సిగ్గు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, ఆశా కార్యకర్తల మండల అధ్యక్షురాలు నక్కా శైలజ, కోరుమిల్లి లక్ష్మీపార్వతి, నాగకుమారి, కనకదుర్గ నాగమణి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు గడ్డిని తింటూ, కోలాటం నృత్యాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల యూనియన్‌ నాయకురాలు రాజేశ్వరి, అంగన్వాడీ వర్కర్స్‌ ప్రాజెక్టు అధ్యక్షరాలు దీన స్వరూపారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యడవల్లి వెంకట దుర్గారావు, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పాల్గొన్నారు.గణపవరం : గణపవరంలో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం.ఆంజనేయులు మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీలపై నిర్బంధాలు విధిస్తే ఉద్యమ బాట వదిలిపెట్టేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు మహాలక్ష్మి, సీతామహాలక్ష్మిచ పార్వతి, నాగమణి, రమణ పాల్గొన్నారు.కాళ్ల : కాళ్ల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు కాళ్ల మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యిర్రింకి ఏడుకొండలు, మునగాల నాగలక్ష్మి సంఘీభావం తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం నుంచి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సంఘం దాసరి వెంకటేశ్వరరావు, ఈదా రవికుమార్‌, కొల్లి వెంకటదుర్గాభవాని, గంటా భవాని, డి.రాజా పాల్గొన్నారు.తణుకు రూరల్‌ : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మహాత్మ గాంధీకి చేతులు ఎత్తి దండాలు పెట్టారు. సమస్యలు పరిష్కరించాలని, వైసిపి ప్రభుత్వానికి బుద్ది ఇవ్వాలని, ఇచ్చిన మాట అమలు చేయాలని, ఎస్మా రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, మండ లాధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.ఆదినారాయణబాబు, గుబ్బల గోపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నా యకు లు రంగారావు, జ్యోతి, మణిమాలతి, ప్రమీల, కనక దుర్గ, వసంతకుమారి, ధనలక్ష్మి, సత్యవతి, రజని పాల్గొ న్నారు.పోడూరు : పోడూరులో అంగన్‌వాడీలు 30 అకారంలో కూర్చుని తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, జె.ఉమాదేవి, రాయుడు కుమారి, సిఐటియు నాయకులు పిల్లి ప్రసాద్‌, బూరాబత్తుల వెంకటరావు పాల్గొన్నారు.యలమంచిలి:యలమంచిలిలో అంగన్‌వాడీలు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌ మాట్లాడుతూ అంగన్వాడీలపై ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దుచేసి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రజిని, దేవి పాల్గొన్నారు.పాలకొల్లు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. మొగల్తూరు : మొగల్తూరులో అంగన్వాడీలు మోకాళ్లపై నిల్చుని నిరసన ప్రదర్శన చేశారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీత, జ్యోతి, సారమ్మ, అనురాధ, వెంకటరమణ పాల్గొన్నారు.పెనుగొండ : మండలంలోని పంచాయతీ పార్కు వద్ద సమ్మె శిబిరంలో అంగన్‌వాడీ కార్యకర్త నాగలక్ష్మి మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్క రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు, సిఐటియు నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆచంట (పెనుమంట్ర) : పెనుమంట్రలో అంగన్‌వాడీలు ఆటపాటలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు ఎ.అజరుకుమారి మాట్లాడారు. సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాసప్రసాద్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌, సిపిఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్‌ సంఘీభావం తెలిపారు.అత్తిలి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. మండలంలోని అంగన్‌వాడీలు కార్యకర్తలు, సహాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంబాబు, కౌలు రైతు సంఘ: నాయకులు కేతా గోపాలన్‌ పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : అంబేద్కర్‌ కూడలిలో రిలే నిరాహార దీక్షకు సిఐటియు రాష్ట్ర నాయకులు తులసీరామ్‌, జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము, అంగ న్వాడీ ఉద్యోగులు ఆకుల లలిత, గన్నాబత్తుల వెంకటలక్ష్మి, నీలిమ, రాజేశ్వరి, శ్రీలక్ష్మి, నిర్మలకుమారి పాల్గొన్నారు.ఉండి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మె వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు చైతన్య, సత్యవేణి, గడి కుసుమ, వీరవల్లి వెంకటలక్ష్మి, శ్యామల, కుసుమ, చిట్టి మరియా, ప్రేమలత, లలిత పాల్గొన్నారు.

➡️