సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ప్రజాశక్తి – పాలకొల్లు

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఇతర సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ జెఎసి ఆధ్వర్యాన బుధవారం నిరసన తెలిపారు. జెఎసి పాలకొల్లు ఛైర్మన్‌ గుడాల హరిబాబు నేతృత్వాన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద డిప్యూటీ తహశీల్దార్‌ బి.సీతారత్నంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరిబాబు, యుటిఎఫ్‌ నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో జెఎసి కన్వీనర్‌ వేగేశ్న మురళీకృష్ణంరాజు, వివిధ సంఘాల నేతలు వి.ఉదరుకుమార్‌, వి.రామ్మోహన్‌, ఎస్‌.రాంజీకుమార్‌, కె.త్రినాధ్‌, ఐవివి.సత్యనారాయణ, ఆర్‌.సుధాకర్‌, కె.రాజశేఖర్‌, డివి.రమణ, బాలచంద్రుడు, ఎస్‌కె.అమలేశ్వరరావు, హరిబాబు, ప్రసాద్‌, తారకసత్య, సిహెచ్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు. కాళ్ల: ఉద్యోగుల సమస్యలు తక్షణ పరిష్కరించాలని, 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్‌.పట్టాభిరామయ్య డిమాండ్‌ చేశారు. జెఎసి పిలుపు మేరకు బుధవారం లక్ష్మీనరసింహపురంలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిహెచ్‌.పట్టాభిరామయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎవివి.సత్యనారాయణ, ఎన్‌.సీతాదేవి, జిడబ్ల్యూపి.కుమార్‌, కె.రాంబాబు, కె.కృష్ణమూర్తి, ఎన్‌ఎ.నరసింహరాజు, విఎల్‌ఎన్‌.వేణుగోపాల్‌ పాల్గొన్నారు. నరసాపురం: సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని జెఎసి అధ్యక్షుడు మామిళ్ల రామసుబ్బారావు అన్నారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఎపి జెఎసి ఆధ్వర్యాన ఆర్‌డిఒ ఎంఎ.అంబరీష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామసుబ్బారావు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎం.మార్కండేయ, వై.అంజిబాబు, కె.బాలాకుమారి, ఎన్‌.చంద్రకుమార్‌, సిహెచ్‌.కృష్ణమోహన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️