సమస్యల పరిష్కారంలో వైసిపి విఫలం

ప్రజాశక్తి – పెనుగొండ

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌కు, స్థానిక ఎంఎల్‌ఎ రంగరాజుకు ప్రజల గోడు పట్టదని, ప్రజా సమస్యల పరిష్కారంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, టిడిపి నేత పితాని సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం ఉదయం దొంగరావిపాలెంలో ప్రజల వద్ద పితాని పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అరాచక పాలన సాగిస్తుందన్నారు. పాలకులను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి గొంతు నొక్కుతోందని ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని పాలకులు సంక్షేమ పథకాలు రద్దవుతాయంటూ విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తాగునీరందించాలని కోరారు. అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అనర్హులకు పట్టాలు అమ్ముకున్నారని ఒక వృద్ధుడు వాపోయాడు. టిడిపిలో పలువురు చేరిక వైసిపి నుండి పలువురు టిడిపిలో చేరారు. దొంగరావిపాలెంలో మల్లుల శ్రీను, మామిడిశెట్టి రాంబాబు, మామిడిశెట్టి చంద్రయ్య ఆధ్వర్యాన పలువురు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆచంట జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, ఆచంట ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, టిడిపి గ్రామాధ్యక్షులు కడలి సత్యనారాయణ, ఎంపిటిసి పితాని శేఖర్‌, నేతలు కోనా రామలింగేశ్వరరావు, కోన వెంకటేశ్వరరావు, వెలిచేటి బాబు రాజేంద్రప్రసాద్‌, గుత్తుల లోకేష్‌ పాల్గొన్నారు.

➡️