సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ

ప్రజాశక్తి – గణపవరం

మండలంలో సర్పంచులు, కార్యదర్శులు పరిపాలన తగు జాగ్రత్తలు తీసుకుని, ప్రజలకు సేవలందించాలని ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి తెలిపారు. గురువారం ఎంపిడిఒ కార్యాలయంలో సర్పంచులకు, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒకరోజు జరిగిన శిక్షణా కార్యక్రమంలో పంచాయతీ నిర్వహణ, స్వరూప స్వభావం, గ్రామ సభలు, పంచాయతీ ఆదాయం పన్నుల చెల్లింపులు తదితర అంశాలపై ఇఒపిఆర్‌డి పివి.సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️