సృజనాత్మకతకు బాలోత్సవం దోహదం

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

ప్రజాశక్తి – తణుకు

బాలల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న తణుకు బాలోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతిస్తోందన్నారు. దీనిలో భాగంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడుదాం కార్యక్రమంలో లక్షల మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభాపాట వాళ్లను తెలియజేస్తున్నారన్నారు. క్రీడలకు తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు ఉంటాయన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు పిల్లలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోలోత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

➡️