సెల్ఫ్‌ రికార్డెడ్‌ రెయిన్‌ గేజీ పరికరం పరిశీలన

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌
భారత వాతావరణ శాఖ సెల్ఫ్‌ రికార్డెడ్‌ రెయిన్‌ గేజీ పరికరాన్ని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి పరిశీలించారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం కాంపౌండులో భారత వాతావరణం శాఖ సెల్ఫ్‌ రికార్డెడ్‌ రెయిన్‌ గేజీ పరికరాన్ని (వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం కొలిచే సాధనం) సోమవారం పరిశీలించారు. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం ఎలా రికారడవుతుంది, రోజుకు ఎన్నిసార్లు పరిశీలించి నమోదు చేస్తారనే సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. సాధారణ రోజుల్లో మూడు గంటలకు ఒకసారి, తుపాన్‌ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రతి గంటకు ఒక సారి పరిశీలించి నమోదు చేస్తామని, నమోదు చేసిన రిపోర్టును వాతావరణ కేంద్రాలు చెన్నై, అమరావతి, విశాఖట్నానికి పంపుతామని వాతావరణ శాఖాధికారి జిల్లా కలెక్టర్‌కు వివరించారు. పకృతి వైపరీత్యాల సమయంలో రిపోర్టును జిల్లా, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలకు త్వరితగతిన పంపించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. వారితో పాటు ఆర్‌డిఒ ఎం.అచ్యుత అంబరీష్‌, వాతావరణ శాఖ అధికారి జివి.దొర ఉన్నారు.

➡️