హక్కుల పై అవగాహనుండాలి

Jan 5,2024 21:06

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌ సుందర్‌ రెడ్డి

ప్రజాశక్తి – భీమవరం

వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్‌ కలెక్టరు ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అధికారులు, వినియోగదారుల ఉద్యమ సభ్యులు, విద్యార్థులతో జెసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయని, నాణ్యత విషయంలో లోపాలుంటే సామాన్య వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయిలో ఉన్నప్పుడే సమస్యలు తెలుస్తాయని, అప్పుడే పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ టి.శివరామ ప్రసాద్‌, డిఎస్‌ఒ ఎన్‌.సరోజ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.మహేశ్వరరావు, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఎ.సుందర రామిరెడ్డి, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సిహెచ్‌.వెంకటరమణ పాల్గొన్నారు.

➡️