నిడమర్రు పరిధిలో 16.62లక్షల సీజ్

Mar 29,2024 15:17 #West Godavari District

నిడమర్రు సీఐ సుభాష్
ప్రజాశక్తి-గణపవరం : రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిడమర్రు సర్కిల్ పరిధిలో ఉన్న గణపవరం నిడమర్రు చేబ్రోలు గ్రామాల పరిధిలో తనిఖీ నిర్వహించి వాహనాల యజమానుల దగ్గర ఇటువంటి ఆధారం లేని పత్రాలు లేని 16 లక్షల 62 వేల 600 రూపాయలు సీజ్ చేసి జిల్లా ట్రెజరీ అధికారులకు అందజేసినట్లు నిడమర్రు సీఐ ఎంవి సుభాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ వారి సూచనలు మేరకు వాహనాల్లో 50 వేలు కంటే అదనంగా తీసుకెళ్తే ఆ సొమ్ముకు సంబంధించిన పత్రాలు ఆధారాలు చూపించాలని అన్నారు. ఉదయం సరిపల్లి హెచ్పి బంకు దగ్గర ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ లో భీమవరం నుండి గణపవరం వస్తున్న వాహనాలు తనిఖీలో ఇల్ల రవీంద్ర దగ్గర నుండి 11,4700 వేగేశ్న వెంకట సుబ్బరాజు వద్ద నుండి 5 లక్షల మొత్తం 61,47,00 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గణప వరం ఎస్ఐ వి వెంకటేశ్వరరావు ఎఫ్ ఎస్ టి అధికారి టిఎల్ సరస్వతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️