ఉచిత వైద్య శిబిరంలో 69 మందికి పరీక్షలు

ప్రజాశక్తి – పెనుగొండ

వైద్య శిబిరంలో 69 మందికి వైద్య పరీక్షలు అందించినట్లు మానవత అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాస్‌ తెలిపారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, ఎస్‌వికెపి డాక్టర్‌ కెఎస్‌.రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైద్య శిబిరంలో పరిసర ప్రాంతాల ప్రజలు 47 మంది షుగర్‌, బిపి, కీళ్లనొప్పులు, గుండె సమస్యలకు చికిత్స చేయించుకున్నారని, 22 మంది దంత వైద్య శిబిరానికి మొత్తం 69 వైద్య సేవలు పొందారన్నారు. మంది హాజరైనట్లు తెలియజేశారు. ఈ శిబిరంలో అమత హాస్పటల్‌ మరియు రత్నాస్‌ సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవా సహకారంతో ఘనంగా నిర్వహించారు.ఈ శిబిరంలో అమత ఆస్పటల్‌ డాక్టర్‌ వల్లభనేని కిషోర్‌ డాక్టర్‌ పి. భార్గవ్‌ సాయిరాం వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా డాక్టర్‌ మేడపాటి మురళి జోగి రెడ్డి దంత సమస్యలకు సేవలందించారు. ఈ శిబిరంలో మానవతా ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయరాజ బచ్చు లక్ష్మి నరసింహ మూర్తి, రీజినల్‌ కర్రీ నరేందర్‌ రెడ్డి, కాకర శశి కుమార్‌, మురళీకష్ణ , రమేష్‌, షేక్‌ మస్తాన్‌, అత్యం నవీన్‌, టీ దివాకర్‌, వసంత కుమార్‌, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️