ఘనంగా పాఠశాలల వార్షికోత్సవం

ప్రజాశక్తి – మొగల్తూరు
ఎంతోమంది విద్యార్థులను ప్రతిభా పాఠశాల ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిందని ఎంఇఒ యు.శామ్యూల్‌జాన్‌, వైఎన్‌ కళాశాల హెచ్‌ఆర్‌డి చినిమిల్లి శ్రీనివాసులు అన్నారు. మొగల్తూరులోని కోట రోడ్డులో ఉన్న ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాల 36వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం.సుష్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. చిన్నారు లను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది దేశానికి అందించా లన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యప్రద ర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆహ్లాదంగా గడిపారు. అనంతరం ఎంఇఒ శామ్యూల్‌జాన్‌, హెచ్‌ఆర్‌డి చిన్నమిల్లి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి మేకల పరుశురాం, ఆంధ్రాబ్యాంక్‌ విశ్రాంత ఉద్యోగి ఆకన కేశవరావు, సొసైటీ మాజీ డైరెక్టర్‌ కొత్తపల్లి నాగరాజు, బొల్ల కృష్ణ పాల్గొన్నారు. పెనుమంట్ర :పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ప్రతి పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించాలని పెనుమంట్ర ఎంఇఒ-1 వై.లక్ష్మీనారాయణ అన్నారు. పొలమూరు శివారు నాగళ్లదిబ్బ మండల రెగ్యులర్‌ ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన వార్షికోత్సవ సభకు ఆయన అధ్యక్షత వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కెఎన్‌వి.శ్రీనివాస్‌, మానవత స్వచ్ఛంద సంస్థ జిల్లా కార్యదర్శి కొత్త సత్యనారాయణమూర్తి, మండల శాఖ ప్రతినిధి బి.శ్రీనివాస్‌, విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️