పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు

Mar 11,2024 14:16 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సై ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావులను వలపని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. 498 కేసులో కొంతమంది పేర్లను తొలగించేందుకు రూ 25 వేలు డిమాండ్ చేశారు .. దీంతో బాధితుడు సాగర్ ఏలూరు వెళ్లి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. లంచం ఇస్తుండగా జీప్ డ్రైవర్ కి ప్రసాద్ కి ఇవ్వమని ఎస్సై చెప్పటంతో బాధితుడు ఆ సొమ్మును డ్రైవర్ కి ఇచ్చాడు. వెంటనే ఏసీబీ పోలీసులు రంగంలోకి దిగడంతో ఎస్సై, రైటర్ , డ్రైవర్ లు ముగ్గురు. పరారయ్యారు. ఇటు ఏసీబీ అధికారులు కూడా వారిని వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్ గా పనిచేస్తున్న హోంగార్డు ప్రసాద్ మాత్రం చిక్కలేదు. లంచం ఇచ్చిన సొమ్ము రూ 25వేలు ను స్వాధీనం చేసుకుని ఎస్సై బీఎస్ డీ ఆర్ ప్రసాద్, రైటర్ జోగి నాగేశ్వరరావు అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీహరి రాజు చెప్పారు.

➡️