కూటమి గెలుపు తధ్యం

టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

రాష్ట్రంలో కూటమి గెలుపు తధ్యమని, రాష్ట్రం మరలా పురోగతి సాధిస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షులు, ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిగూడెం టిడిపి కార్యాలయానికి విచ్చేసి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల మల్లికార్జునరావు (బాబ్జి)ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్రం మళ్లీ పురోగతి సాధిస్తుందన్నారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటికి వలవల బాబ్జీ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి మద్దతు తెలిపి, కష్టపడి పనిచేశారని కొనియాడారు. వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుల అన్నవరం, పరిమి రవికుమార్‌, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్‌, ముత్యాల సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️