ఆసరా సంబరాల మహోత్సవాలు జయప్రదం చేయాలి 

Jan 29,2024 15:15 #West Godavari District
asara program in achanta

ఎమ్మెల్యే రంగనాథరాజు 
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా రుణ మాఫీ పూర్తి స్థాయిలో నాలుగు విడతల్లో వారి ఖాతాల్లోనే జమ చేయడం  జరిగిందని ఆచంట నియోజకవర్గం  మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు  ఎమ్మెల్యే చెరుకువాడ  శ్రీ రంగనాధరాజు  అన్నారు.   పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం  పోడూరు మండలం తూర్పు పాలెం  క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో  క్యాంపు కార్యాలయం సమీపంలో ఘనంగా మనసారా ఆసరా సంబరాల  మహోత్సవాలు  నిర్వహిస్తున్నాం ఆయన తెలిపారు. నియోజకవర్గంలో డాక్వా అక్క చెల్లెమ్మలకు రూ.173 కోట్లు వరకూ వారి ఖాతాల్లో జమ చెయ్యాడం జరిగిందని 2019 నాటికి రుణాలు తీసుకున్న 43,050 మంది అర్హులుగా గుర్తించి వారి ఖాతాల్లో జమ చేసామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు నిర్వహిస్తామని, ప్రతి రోజు సుమారు 5వేల మంది డ్వాక్రా మహిళలు సంబరాల్లో పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  అనంతరం ఆత్మీయ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం  పార్టీలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం  అక్క చెల్లెమ్మలకు చీర  సారీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్  చిల్లే లావణ్య, గౌరీ సుభాషిని, కృష్ణవేణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️