యువతకు ఆదర్శం బాబూ జగ్జీవన్‌రామ్‌

ఘనంగా జయంతి వేడుకలు
ప్రజాశక్తి – భీమవరం
ఎపిఎస్‌సి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ భవన్‌ – విజ్ఞాన సాంస్కృతిక వికాస కేంద్రంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎ.వీరయ్య, ఎన్‌.విజయకుమార్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎపి బహుజన జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు కోనా జోసఫ్‌, అసోసియేషన్‌ సెక్రటరీ ఎన్‌.విజయకుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.రాజబాబు, వైస్‌ ప్రెసిడెంట్‌ అమూల్యరావు, కోశాధికారి డాక్టర్‌ ఎంవిఎస్‌.ప్రసాద్‌, సభ్యులు కె.శ్రీనివాసరావు, కె.సోమయ్య, కె.నాగరాజు, ఎన్‌.రాజేందర్‌, బహజన జెఎసి కన్వీనర్‌ తాళ్లూరి మధు, ఉపాధ్యక్షులు బి.రమేష్‌బాబు, ఈది రవికుమార్‌, బుంగా ఆదాము, వి.సువర్ణరాజు, పి.శ్రీనివాసరావు, కె.మేరీ పాల్గొన్నారు. పెనుమంట్ర : అణగారిన, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా వారి జీవితాల్లో డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ వెలుగులు తెచ్చారని టిడిపి ఆచంట ఎంఎల్‌ఎ అభ్యర్థి పితాని సత్యనారాయణ అన్నారు. మల్లిపూడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జగ్జీవన్‌రామ్‌ 116వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాబాసాహెబ్‌అంబేద్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌ వంటి మహానేతల పుట్టినరోజులు ఏప్రిల్‌లో రావడం గొప్ప విశేషమన్నారు. వారి ఆశయాల సాధనలో అందరూ ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచంట జెడ్‌పిటిసి సభ్యులు ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపిపి దిగుమర్తి సూర్యకుమారి పాల్గొన్నారు.ఆచంట : సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయులు, పేదలు, అణగారిన వర్గాల కోసం పోరాడిన ధీరుడు భారత తొలి ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని ఆచంట మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌ కొనియాడారు. మండలంలో కొడమంచిలి అరుంధతిపేటలో డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సెల్‌ ఆచంట మండలాధ్యక్షులు ఆకుమర్తి రాంబాబు, వైసిపి మహిళా విభాగం మండలాధ్యక్షురాలు కొండేటి లక్ష్మి, ఆలయ కమిటీ మెంబర్‌ కొండేటి వెంకాయమ్మ, వార్డు మెంబర్‌ చింతపర్తి హరికృష్ణ, సచివాలయ కన్వీనర్‌ కొండేటి వరప్రసాద్‌ పాల్గొన్నారు.తణుకు రూరల్‌ : బాబూజగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను తణుకు బార్‌ అసోసియేషన్‌ హాలులో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సూరంపూడి కామేష్‌ మాట్లాడారు. జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు న్యాయవాదులంతా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు కొండా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఈద రామకృష్ణ, ట్రెజరర్‌ ఎం.మృత్యుంజయరావు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ముప్పిడి సుబ్బయ్య, గొల్లపల్లి అంబేద్కర్‌, వెన్నపు సుధాకర్‌, కామన మునిస్వామి, కండిబోయిన ఆనంద్‌, కొల్లి ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.గణపవరం : మండలంలోని వెంక ట్రాజపురంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎం.సురేష్‌, వైసిపి నాయకులు పాల్గొన్నారు. గణపవరం డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్‌ పి.నిర్మలకుమారి అధ్యక్షత నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి జి.వెంకటరమణ మాట్లాడారు. జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో లెక్చలర్లు టి.అక్కరాజు, సిహెచ్‌.చైతన్య, కె.స్వరూపరాణి, ఎఎన్‌విఎన్‌బి శ్రీనివాసరావు, జి.వెంకటరమణ పాల్గొన్నారు.కాళ్ల : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్‌రామ్‌ ఎనలేని సేవలు చేశారని టిడిపి ఉండి ఎంఎల్‌ఎ అభ్యర్థి మంతెన రామరాజు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు అన్నారు. వేంపాడు గ్రామంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండలాధ్యక్షులు జివి.నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి ఆరేటి వెంకటరత్నప్రసాద్‌, అభిరుచి కాశీరాజు, సీనియర్‌ ఎంఆర్‌పిఎస్‌ నాయకులు రాపాక ప్రసాద్‌, జిల్లా అధ్యక్షులు ముసుకూడి రాము, విజిలెన్స్‌ మానిటర్‌ కమిటీ సభ్యులు ముమ్ముడివరపు ఏసుపాదం పాల్గొన్నారు.పోడూరు : మండలంలోని కొమ్ముచిక్కాల గ్రామంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండలాధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మాజీ సర్పంచి చంటిరాజు, బాలాజీ, యూత్‌ నాయకులు పాల్గొన్నారు. పాలకోడేరు : భీమవరంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు బాలకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.పాలకొల్లు : పాలకొల్లులోని వైసిపి కార్యాలయంలో, గాంధీ బొమ్మల సెంటర్‌లో జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ, టిటిడి పాలకమండలి సభ్యులు మేకా శేషుబాబు, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ సాలా నర్సయ్య, జెసిఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఖండవల్లి వాసు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ధర్మారావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీబొమ్మల సెంటర్‌, తహశీల్దార్‌ కార్యాలయ సెంటర్లలో ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, జనసేన నాయకులు బోనం చినబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కనుమూరి సీతారామరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, కొండేటి నరేష్‌, కుందుర్తి సురేష్‌ పాల్గొన్నారు.భీమవరం రూరల్‌ : టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎన్నికల కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి జనసేన భీమవరం ఎంఎల్‌ఎ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) దళిత నాయకులతో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్‌సి సెల్‌ జిల్లా అధ్యక్షుడు చుక్కా సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు ఏసుపాదం, టిడిపి జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్‌బాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️