డ్రెయిన్ల పూడిక తీత

ప్రజాశక్తి – ఉండి

మండలంలోని పెద పుల్లేరు గ్రామంలో ఆదివారం డ్రెయినేజీ వ్యవస్థ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి కరణం పార్వతి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, చాలా కాలంగా డ్రెయినేజీలో సిల్ట్‌ తీయక పూర్తిగా నిండిపోయాయి దుర్గంధం వెదజల్లుతున్నాయన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నివారణలో భాగంగా డ్రెయినేజీలో చెత్తా చెదారం వేయకుండా పంచాయతీకి గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. డ్రెయినేజీలో తీసిన సిల్ట్‌ను వేరే ప్రాంతానికి తరలించారు.

➡️