మార్నింగ్ వాక్ తో ప్రచారం

Mar 30,2024 12:09 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం: సచివాలయం సేవలు, ఆర్బీకే సెంటర్స్, వైస్సార్ హెల్త్ క్లినిక్ లను ఓట్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శనివారం ఉదయం 6గంటలు నుండే వేములదీవి ఈస్ట్ ఘంటసాల వారి మెరకలో మార్నింగ్ వాక్ చేస్తూనే ప్రసాదరాజు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల సీజన్ కావడంతో ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరారు.

➡️