హక్కుల సాధనకు పోరాటమే మార్గం

Jan 26,2024 16:56 #West Godavari District
citu meeting winning celebration

ప్రజాశక్తి-గణపవరం (నిడమర్రు) : కార్మికుల హక్కుల సాధనకు పోరాటాల మార్గమని సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అన్నారు శుక్రవారం నిడమర్రు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద జరిగిన అంగన్వాడీల విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సభకు నిమ్మల పార్వతి అధ్యక్షత వహించారు సభలో పాల్గొన్న లింగరాజు మాట్లాడుతూ కార్మిక చట్టాలు రక్షణ కోసం ఐక్య పోరాటాల అవసరమని అన్నారు 42 రోజులు సమ్మె చేసి విజయం సాధించిన అంగన్వాడీలో వీరోచిత పోరాటపటమును ఆయన అభినందించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలకు అంగన్వాడీలు చేసిన 42 రోజులు సమ్మె మార్గదర్శమని అన్నారు. ఈ సభలో యుటిఎఫ్ నిడమర్రు మండల నాయకులు ఎస్కే మౌలాలి సిపిఎం నాయకులు గవర సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ఏ నాగమణి త్రివేణి సిహెచ్ కుమారి సిహెచ్ అరుణ ఎస్కే రబియా ధనలక్ష్మి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ సమ్మె జయప్రదం కావడానికి సిఐటియు అండగా నిలిచిందని అన్నారు సిఐటియు రాష్ట్ర జిల్లా కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️