అదరించండి… అభివృద్ధి చేస్తా

May 3,2024 14:18 #pracharam
  • వేటుకూరి వెంకట శివరామరాజు
    ప్రజాశక్తి -కాళ్ళ
    మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ పార్టీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. పెదఅమిరం, వేంపాడు, కోపల్లె, బండాడ,బండాడపేట, జక్కరం, సీసలి, కోమటిగుంట గ్రామాల్లో శుక్రవారం ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆటోలో విన్నూతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు శివరామరాజుకు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని శివరామరాజు ఓటర్లను అభ్యర్థించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, శివరామరాజు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
➡️