వైసిపి పాలనతో విసుగు

ప్రజాశక్తి – తణుకు రూరల్‌

వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసుగెత్తిపోయారని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. అత్తిలి, దువ్వ, వరిఘేడు గ్రామాలకు చెందిన అనేక మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశాసి రాధాకృష్ణను కలిసి టిడిపిలో చేరతామని సంసిద్ధత వ్యక్తం చేశారు. వారందరికీ పసుపు కండువా కప్పి టిడిపిలోకి రాధాకృష్ణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి విధానాలతో, ముఖ్యంగా తణుకు ఎంఎల్‌ఎ కారుమూరి నాగేశ్వరరావు నియంత పోకడలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాబోయే కాలంలో టిడిపిలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని, ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పితాని మోహన్‌, కట్టా సూర్యారావు, మంగ ఇమ్మానుయేల్‌, శ్రీనివాసరావు, కరుటూరి సర్వేశ్వరరావు, కోణాల మల్లికార్జునరావు, ఏరుబడి సత్యనారాయణ, తోట వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️