ఘనంగా ఈస్టర్ వేడుకలు

Mar 31,2024 11:03 #West Godavari District

ప్రజాశక్తి- నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పలు చర్చ్ లలో తెల్లవారుజామున నుండే ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే రోజున సిలువపై అవుసులు బాసిన యేసు మూడో రోజు సమాధులు నుండి భక్తులకు దర్శనమిస్తారు. క్రీస్తు పునరుత్థానం చేసిన మహోన్నత రోజు ఈస్టర్ అని, క్రైస్తవులు పునరుత్థాన శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలని క్రైస్తవ మత పెద్దలు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున నుండేసమాధులు వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలో ఏసు ప్రభు కోసం ప్రత్యేక పాటలు ఆలపించారు. పట్టణ, మండలంలో పలు చర్చ్ లు సందడిగా కనిపించాయి.

➡️