వికలాంగుల నిర్ధారణ వైద్య శిబిరాల పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల

మండలంలోని ప్రత్యేక అవసరాల గల బాల బాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీకి వికలాంగుల నిర్ధారణ గుర్తింపు వైద్య శిబిరం పోస్టర్‌ను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి పి.వెంకటరావు ఆవిష్కరించారు. సమగ్ర శిక్ష జిల్లా ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని ఎలిమెంటరీ సెకండరీ, సీనియర్‌ సెకండరీల పాఠశాలలోని 6 నుంచి 18 సంవత్సరాల వికలాంగ బాలబాలికల లబ్ధిదారుల గుర్తింపు శిబిరం పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సిబ్బంది, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వి.చంద్రశేఖర్‌, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ వై.శ్రీనివాసరావు, ఐఆర్‌టిలు ఎన్‌.దయామని, కె.భువనేశ్వరి, పి.పద్మావతి పాల్గొన్నారు.

➡️