టిడిపిలో చేరిక

Jan 26,2024 15:41 #West Godavari District
join in tdp

ప్రజాశక్తి-కాళ్ళ : రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని ఉండి ఎంఎల్ ఏ మంతెన రామరాజు అన్నారు.
శుక్రవారం కోపల్లెగ్రామంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కోపల్లె గ్రామ వైసిపి అధ్యక్షుడు దంతులూరి శ్రీనివాసరాజు, ఉండి ఏఎంసీ డైరెక్టర్ బుంగా ఆదాం డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి ఎంఎల్ ఏ మంతెన రామరాజు సమక్షంలో టిడిపిలోకి చేరారు. టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీలోకి చేరిన వారు కొవ్వూరి శ్రీనివాసరాజు, కాపా రాజశేఖర్ లు టిడిపిల్లోకి చేరారు. ఈ గ్రామ సర్పంచ్ బూడి నాగ మణి, ఉప సర్పంచ్ బూడి వెంకట పర్రాలు, క్లస్టర్ ఇంచార్జి తోట ఫణిబాబు, మహాశక్తి టీము సభ్యులు బోధనపు రత్నకుమారి, కొట్టు ఇందిర, తిరుమలశెట్టి లీలావతి, పోతల పద్మ కుమారి, టిడిపి నాయకులు పుప్పాల బుజ్జి, బూడి సత్యనారాయణ, బాలం బాపూజీ, వీరవల్లి సత్యనారాయణ, నాగరాజు, ఆముదాలపల్లి వీరబ్రహ్మం, మంతెన సుబ్బరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️