కలక్టరేట్ లో జ్యోతి రావ్ ఫూలే జన్మదిన వేడుకలు

Apr 11,2024 12:06 #West Godavari District

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ :  నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి, ఆనాటి పరిస్థితులని ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతి రావ్ ఫూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఉదయం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 197 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి రావ్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వారూ అనుకున్న లక్ష్యాలను, ఆశయాలను ఆచరణలో పెట్టడం లో జ్యోతి రావ్ ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. స్త్రీ విద్య ను ప్రోత్సహించడం , బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పొరటం చెయ్యడం జరిగిందనీ తెలియ చేశారు. ఆనాటి పరిస్థితులని ఎదిరించి విద్య యొక్క ఆవశ్యకత ను,   ముఖ్యం స్త్రీ విద్య కోసం చాటి చెప్పడం జరిగిందనీ అన్నారు. అందులో భాగంగానే బాలికల విద్య కోసం సావిత్రి రావ్ ఫూలే ప్రత్యేక పాఠశాలను ప్రారంభించడం జరిగిందనీ అన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకుని రావడం జరిగిందన్నారు. నేటి యువత ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకునే వాటి సాధనకు కృషి చెయ్యాలని పిలుపు నివ్వడం జరిగింది. మన ఉద్యోగ బాధ్యతల విషయంలో కూడా నిబద్దత కలిగి పనిచేయడంలో అటువంటి వారీ జీవితాల నుంచీ స్పూర్తి పొందాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో మనందరం సమన్వయంతో పనిచేయాలని, కలెక్టర్ ఆదేశాలను అనుసరించి చక్కటి పనితీరు చూపి, ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ ఎం. భవానీ ప్రకాష్ , బిసి సంక్షేమ అధికారి పి. రమేష్ బాబు, సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, గిరిజన సంక్షేమ అధికారి కె యస్ జ్యోతి, వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా విద్యా అధికారి కే. వాసుదేవ రావు, డ్వామా పిడి ఏ. ముఖ లింగం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️