జనసేన గూటికి కొత్తపల్లి సోదరులు

Feb 21,2024 10:40 #West Godavari District
kottapalli in jsp

ప్రజాశక్తి-నరసాపురం : మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయడు జనసేన లో చేరనున్నారు.మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో ఈ నెలాఖరు లోగా కొత్తపల్లి సుబ్బరాయడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్ జనసేన లో చేరనున్నారు.2019ఎన్నికల్లో కి ముందు టీడీపీ కి రాజీనామా చేసి వైకాపా లో చేరిన కొత్తపల్లి సోదరులు. 2019 వైఎస్సార్సీపీ నుండి ప్రసాదరాజు గెలవడం లో సుబ్బరాయడు కీలకంగా వ్యవహరించారు. జిల్లా కేంద్రం భీమవరం కి తరలి పోవడంతో సొంత పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి వైసీపీ సస్పెండ్ చేసింది. సైలెంట్ గా కొత్తపల్లి ఒక్కసారిగా ఎన్నికల ముందు జనసేన లో చేరనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. మరోవైపు నరసాపురం జనసేన ఇంచార్జ్ గా బొమ్మిడి నాయకర్ ఉన్నారు. సుబ్బారాయుడు జనసేన లో చేరితే టికెట్ నరసాపురం ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికో ఇస్తారోవేచి చూడాల్సి ఉంది.2009లో కొత్తపల్లి టీడీపీ కి రాజీనామా చేసి ప్రజారాజ్యం లో చిరంజీవి, పవన్ తో పనిచేసిన అనుబంధం ఉంది.

➡️