లయన్స్‌ సేవలు అభినందనీయం

ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం లయన్స్‌ క్లబ్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. లయన్స్‌ క్లబ్‌ సేవా కార్యక్రమాల్లో భాగంగా కడకట్లలోని జనతా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆవరణలో అధ్యక్షులు వంగపండు రామోహనరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌ ప్రారంభించారు. నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్‌ నేత్ర వైద్యశాల వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా డిప్యూటీ గవర్నర్‌ లయన్స్‌ పదం కుమార్‌ గుప్తా ఆర్థిక సహకారంతో 132 మందికి కంటి పరీక్షలు చేసి, ఉచిత కంటి ఆపరేషన్లు నిమిత్తం 14 మందిని నిడదవోలు హాస్పటల్‌కు పంపించారు. 23 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంఎల్‌ఎ చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ సభ్యులందరూ ఆలోచించి తాడేపల్లిగూడెం పట్టణంలో మంచి పార్కును ఏర్పాటు చేయాలని సూచించారు. లయన్స్‌ క్లబ్‌ తరఫున ఎలాంటి సేవా కార్యక్రమాలు అయినా చేయడానికి ముందు ఉంటానని ఆయన అన్నారు. లయన్స్‌ క్లబ్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ మదన్‌ మోహన్‌ అగర్వాల్‌, బాపయ్య శర్మ, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️