నరసాపురం సీట్లను కాపులకే కేటాయించాలి

Apr 6,2024 12:57 #West Godavari District

మాజీ సర్పంచ్ కూనప రెడ్డి డిమాండ్ 

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురం పార్లమెంటు అసెంబ్లీ సీట్లను సామాజిక వర్గ కలిగి ఉన్న కాపు వర్గానికి కేటాయించాలని, కాపులకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రాధాన్యత కల్పిస్తుందో వారికే మా మద్దతు ఉంటుందని సీనియర్ రాజకీయ నాయకులు మాజీ సర్పంచ్ రంగారావు తెలిపారు. నరసాపురం మండలంలోని వైఎస్ పాలెం మాజీ గ్రామ సర్పంచ్ , నర్సాపురం మండలం కాపు సంఘ మండల మాజీ అధ్యక్షుడు కూనప రెడ్డి రంగారావు అన్నారు. శనివారం ఆయన పాత్రికేయులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో నర్సాపురం నియోజకవర్గంలో అత్యధిక సామాజిక వర్గం కలిగి ఉన్న కాపు సామాజిక వర్గమే రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించారని తెలిపారు. గ్రంధి వెంకటరెడ్డి నాయుడు హయాం నుండి నేటి వరకు చేగొండి హర రామజోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు, కొత్తపల్లి జానకిరామ్, బండారు మాధవ నాయుడు తదితరులు అసెంబ్లీ అభ్యర్థులుగా గెలుపొంది సారద్యం వహించారని తెలిపారు. చేగొండి హరి రామ జోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగి నరసాపురం కీర్తి ప్రతిష్టలతో పాటు దేశ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించాలని కూనప రెడ్డి రంగారావు అన్నారు. అటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్న కాపు సామాజిక వర్గాన్ని నిర్వీర పరిచే విధంగా తమ సామాజిక వర్గాన్ని ప్రధాన రాజకీయ పార్టీల దూరంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని, కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని కూనపురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయితే అధిక శాతం కలిగి ఉన్న కాపు సామాజిక వర్గానికి నరసాపురం అసెంబ్లీ పార్లమెంటు సీట్లు కేటాయిస్తాయో వారికే మా మద్దతు ఉంటుందని నరసాపురం మండల సర్పంచుల ఛాంబర్స్ మాజీ అధ్యక్షుడు కూనపు రెడ్డి రంగారావు తెలిపారు. నరసాపురం అసెంబ్లీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తమ సామాజిక వర్గాలను చెంది ఆర్థిక స్థిరపడి పేరు పొందిన కుటుంబాల నుండి రాజకీయ నేపథ్యం కలిగి ఉన్న అనేక మంది యువ రాజకీయ నాయకులు ఉన్నారని నాయకులకు కొదవలేదని అన్నారు. కాపు సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ అయితే ప్రాధాన్యత కల్పించి తగిన గుర్తింపు కలిపిస్తుందో ఆ రాజకీయ పార్టీకే మా సామాజిక వర్గ మద్దతు ఉంటుందని ఇది కాపులందరి తరపున ఇది అభిప్రాయం గా నేను తెలియచేస్తూన్నానని కూనపురెడ్డి తెలిపారు.

➡️