శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యం

డాక్టర్‌ మాదంశెట్టి కోటేశ్వరరావు

ప్రజాశక్తి – నరసాపురం

ప్రతి ఒక్కరూ బాల్యమునుంచే చదువుతో పాటు, ఆటలు కూడా ఆడుతూ ఉండటం వల్ల శరీర ఆరోగ్యము సాధ్యమవుతుందని ప్రముఖ డాక్టర్‌ మాదంశెట్టి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక నరసాపురం ఆదిత్య పాఠశాలలో నేషనల్‌ డాక్టర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్‌ మాదంశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదమును విశదీకరిస్తూ, మానసిక వికాసం పెంపొంది తద్వారా వ్యక్తిత్వ వికాసం ఏర్పడుటకు దోహద పడుతుందన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తతతో ఉండి ముందుగానే తగు జాగ్రత్తలు పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డాక్టర్‌ని సన్మాన సత్కారాలతో గౌరవించారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎస్‌వి.రాఘవరెడ్డి సమాజంలో డాక్టర్‌ ఆవశ్యకతను గురించి సవివరంగా తెలియజేశారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.శివకోట ప్రసాద్‌, డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️