టిడ్కో గృహాల వద్ద పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌

9 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద పట్టణ పోలీసులు మంగళవారం కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గృహాల్లో రికార్డులు పరిశీలించారు. రికార్డులు సరిగా లేని, నెంబర్‌ ప్లేట్లులేని 9 మోటార్‌ సైకిళ్లు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే తరువాత వాటి రికార్డులు తీసికొనివచ్చి వాటిని వాహనదారులు తీసికొని వెళ్లారు. ఈ సెర్చ్‌లో సిఐ మంగాదేవి, ఎస్‌ఐ బాదం శ్రీనివాస్‌, ఎఎస్‌ఐలు ముద్దల శివాజీ, శీలబోయిన ఏసుబాబు, మారిలింగం పాల్గొన్నారు.

➡️