క్రికెట్‌ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రధానం

ప్రజాశక్తి – నరసాపురం

చిన్నమామిడిపల్లిలోని శ్రీనాగారమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారంతో ముగిసింది. సరిపల్లిలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రధా నోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవ నాయుడు, ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ కలిసి పాల్గొన్నారు. ఈ టోర్నీలో పట్టణంలో శ్రీహరిపేటకు చెందిన టీం విన్నర్‌గా నిలిచింది. సరిపల్లి టీం రన్నర్‌గా నిలిచింది. విజేతలకు ప్రథమ బహుమతి రూ.20 వేలు, షీల్డ్స్‌, ద్వితీయ బహుమతి రూ.10 వేలు షీల్ట్స్‌ ఇరువురు నాయకులు కలిసి బహుమతులు ప్రధానం చేశారు.

➡️