పోలమూరు డ్రైన్ ను ఆధునికరించాలి

Feb 9,2024 11:22 #West Godavari District
repair polamuru drain

ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) :  పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పోలమూరు డ్రైన్ ను తక్షణమే ఆధునికకరించాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతగోపాలన్  డిమాండ్ చేశారు. పోలమూరు డ్రైన్ ను వెంటనే ఆధునికరించాలని, తక్షణమే పూడిక పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పొలమూరులో డ్రైన్ వద్ద కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గోపాలన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సార్వా పంటలో  ఆకు మడి దశలోను, పంట చేతికి వచ్చిన తరుణంలోనూ  అధిక వర్షాలు కారణంగా డ్రైన్  కూడుకు పోవడంతో  మురుగనీరు లాగే పరిస్థితి లేక  పంట పొలాలు ముంపు బారిన పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు  జోక్యం చేసుకుని సంబంధిత డ్రైను ఆధునికరించాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తోరం నరసన్న, గుడాల మాణిక్యాలరావు, పంతాల సూర్యనారాయణ, బాగా అప్పారావు, గుడాల వెంకటేశ్వరరావు, చంద్ర పుత్రిమూర్తులు, పెనుమంట్ర సుబ్రహ్మణ్యం, కేతలక్ష్మి నరసన్న తదితరులు పాల్గొన్నారు.

➡️