త్రాగునీటి సమస్య నివారణే ప్రభుత్వ లక్ష్యం

Feb 7,2024 10:12 #West Godavari District
solve water problem

పివిఎల్ నరసింహరాజు
ప్రజాశక్తి-ఉండి : త్రాగునీటి సమస్య నివారణ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని డిసిసిబి చైర్మన్, ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు అన్నారు. బుధవారం ఉదయం ఉండి మండలం యండగండి గ్రామంలోని రెండో సచివాలయ పరిధిలో జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గోగులమండ చిన్న కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ గ్రామంలోని చాలా ప్రాంతాలకు త్రాగు నీటి సమస్య ఏర్పడడంతో సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగిందని దీని ద్వారా రెండో సచివాలయ పరిధిలోని ప్రాంతాలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఇప్పటివరకు రెండో సచివాలయ పరిధిలో గ్రామ సర్పంచ్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరిగిందని ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నూతన వాటర్ ట్యాంక్ తో పైప్ లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి త్రాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసే తనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు సహ ఉపాధ్యక్షురాలు దత్తాల సుజాత రాణి, గ్రామ ఉపసర్పంచ్ పెన్మెత్స జగ్గరాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️