విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు స్పెక్ట్రా 2కె24

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రూరల్‌
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు స్పెక్ట్రా 2కె24 ఎంతగానో ఉపయోగపడుతుందని వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గ్రంధి సత్యనారాయణ అన్నారు. పెదతాడేపల్లి గ్రామంలోని వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్పెక్ట్రా 2కె24 గురువారం ముగిసింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సాంకేతిక ఉత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. డిగ్రీ ఎలా పూర్తి చేశామన్నది ప్రదానం కాదని, చదువుకునే సమయంలో ఏమి నేర్చుకున్నాం అన్నదే ప్రధానమని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ రాంబాబు పాల్గొన్నారు.

➡️