భీమవరం ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా శ్రీనివాస్ రాజు

Apr 8,2024 11:24 #West Godavari District

ప్రజాశక్తి-భీమవరం : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భీమవరం అభ్యర్థిగా దండు శ్రీనివాస్ రాజును నియమిస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.  భీమవరంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ బాడీ సమావేశం స్థానిక కార్యాలయంలో కనుమూరి వెంకటపతి రాజు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫార్వర్డబ్లాక్, జిల్లాకార్యదర్శి, లంక కృష్ణమూర్తి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా,అలిండియా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్రంగా పోటీ చేస్తుందన్నారు. ఎవరితో ఎటువంటి పొత్తులు లేవన్నారు. రాష్ట్రంలో అనేక స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను నిలబెట్టేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు.
జిల్లాలో ఫార్వర్డబ్లాక్, పార్టీ అనేక ప్రజా సమస్యల మీద చేసిందన్నారు. కొత్త జిల్లా ఏర్పాటుకు ఉద్యమం చేసి ఫలితాలు సాధించమన్నారు. దీనిలో భాగంగానే భీమవరంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా శ్రీనివాసరాజు నియమించడం జరిగిందని చెప్పారు. శ్రీనివాసరాజు విజయం కోసం  పార్టీ సభ్యులు, కార్యకర్తలు కృషి చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో వెంకటపతిరాజు, దుగ్గిరాల. శ్రీను, నడింపల్లి. హరనాధరాజు, వాటల.రాంబాబు, కోటేశ్వరరావు, దండు అప్పలరాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️