సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ధన్యజీవి

ప్రజాశక్తి – పెనుమంట్ర

కృష్ణా, గోదావరి నదుల నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతాలను సస్య శ్యామలం చేసిన సర్‌ ఆర్దర్‌ కాటన్‌ ధన్యజీవి అని ఇరిగేషన్‌ ఎఇ గుబ్బల జయశంకర్‌ అన్నారు. బుధవారం కాటన్‌ 221వ జయంతి వేడుకలు మార్టేరు ఇరిగేషన్‌ కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్టేరు ఇరిగేషన్‌ లాకుల వద్ద నెలకొల్పిన కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ సహాయకులు ఎన్‌.బాబులు, సిహెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌.శర్మ, లాక్‌ సూపరింటెండెంట్‌ జోసఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు. పాలకొల్లు: అధికారంలోకి రాబోయే టిడిపి కూటమి రైతు ప్రభుత్వంగా పని చేస్తుందని పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు అన్నారు. సర్‌ ఆర్దర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా తెలుగు రైతు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక లాకుల వద్ద ఉన్న ఇరిగేషన్‌ కార్యాలయ ప్రాంగణంలో నిలువెత్తు కాటన్‌ విగ్రహానికి రైతులతో కలిసి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల్లో పట్టెడన్నం తింటున్నామంటే కాటన్‌ మహాశయుని చలవేనన్నారు. అటువంటి మహానీయుడిని జీవితంలో మర్చిపోలేమన్నారు. కార్యక్రమంలో రైతు నాయకులు ఉంగరాల నరసింహారావు, పెచ్చెట్టి బాబు, అల్లు రాధాకృష్ణ, జివి, కోడి విజయభాస్కరరావు, మామిడిశెట్టి పెద్దిరాజు, కడలి గోపాలరావు, బోళ్ల సుభాష్‌చంద్రబోస్‌, కొండ్రెడ్డి సూరిబాబు, ఇంటి శ్రీరామ్మూర్తి, అందే కోటి వీరభద్రం, దొంగ బాబారు, తాళ్లూరి సత్య శ్రీనివాసరావు, బోనం నాని, చెరుకూరి అంజి తదితరులు పాల్గొన్నారు.

➡️