రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Mar 18,2024 13:21 #West Godavari District

ప్రజాశక్తి-భీమవరం : ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు కోరారు. భీమవరం సబ్ ట్రెజరీ ఇన్ స్పెక్షన్ లో భాగంగా భీమవరం వచ్చిన జిల్లా ఖజానా గణాంక అధికారి ఏ గణేష్ ను భీమవరం యూనిట్ కార్యదర్శి పి సీతారామరాజు, జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాతల జేమ్స్, కార్యదర్శి సాగిరాజు సత్యనారయణ రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎవి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు ఎస్ కే చాన్ భాషా, సీనియర్ పెన్షనర్స్ బి సత్యనారయణ రాజు, చెరుకువాడ రంగసాయి, జీఎస్ రాజు వారిని కలిసి పలు సమస్యలపై వినతులు అందించి సత్కరించారు. కొత్తగా మంజూరైన పిపివోలో పాత జిల్లా కేంద్రమైన ఏలూరు డిటివో కార్యాలయం నుంచి భీమవరం ట్రెజరీకు రావాల్సి ఉందని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చే వరకు ఇదే విధంగా జరుగుతుందని తెలిపారు. టెక్నికల్ ఇబ్బందులు ఉన్నవి తప్ప వారికి వచ్చిన అందరి పిపివో లను ఆయా సబ్ ట్రెజరీ లకు వెంటనే పంపుతున్నామని అన్నారు.

➡️