పూడిక తొలగించాలి

ఇరిగేషన్‌ అధికారులను కోరిన బొలిశెట్టి

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

వచ్చే వర్షాకాలంలో ఎర్ర కాలువ రైతులు ఇబ్బంది పడకుండా నందమూరి అక్విడెక్టు వద్ద పూడికను తొలగించాలని జనసేన తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ ఇరిగేషన్‌ అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరి అక్విడెక్టును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పెద్ద ఎత్తులో ఇసుకమేటలు వేసి అక్విడేట్‌ మొత్తం పూడికపోయే పరిస్థితిలో ఉంటే ఆ పనులు రైతుల చేసుకోవాలని చెప్పడం సమంజసం కాదని, అధికారులకు నివేదించి వెంటనే ఈ పూడిక తీయించాలని కోరారు. రైతులకు తాను అండగా ఉంటానని, పూడిక పనులకు సమయం లేనందున అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని బొలిశెట్టి రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరు, శెట్టిపేట, మారంపల్లి ఆరుల్ల గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు పాల్గొన్నారు.

➡️