తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

Mar 29,2024 12:01 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వైస్సార్సీపీ అధికారంలోకి వస్తే తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములదీవి ఈస్ట్ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. తమ ప్రభుత్వంలో ఇంటికి పెన్షన్ బియ్యం పంపిణీ చేసామన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆయనకు తోడుగా ఆయన కుమారుడు ముదునూరు శ్రీ కృష్ణంరాజు ప్రజాశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ, తిరుమాని నాగరాజు, దొంగ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️