మరోసారి గెలిపించండి

May 10,2024 21:36

 ప్రజాశక్తి- గజపతినగరం : వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి మరోసారి తమను గెలిపించాలని ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య కోరారు. శుక్రవారం గజపతినగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురం నుంచి ప్రారంభమైన ర్యాలీ గజపతినగరం గణేష్‌ కోవెల జంక్షన్‌ మీదుగా దిగువ వీధి వరకు సాగింది. అడుగడుగునా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ తమ పార్టీకి మద్దతు తెలిపే విధంగా ఫ్యాన్‌ గుర్తును చూపిస్తూ ఉత్సాహం చూపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, జెడ్‌పిటిసి గార తవుడు, నాయకులు బెల్లాన త్రినాధ్‌, బూడి వెంకటరావు, కరణం ఆదినారాయణ, మండల సురేష్‌, పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️