భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించండి

May 5,2024 20:33

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర భవిష్యత్‌ కోసం టిడిపి, జనసేన, బిజెపి కూటమిని గెలిపించాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన కోరారు. పట్టణంలోని పాకీవీధి, సాయినగర్‌ కాలనీలో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికా రంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలనతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్దించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ కె.లక్ష్మి, మాజీ కౌన్సిలర్‌ రౌతు రామమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.బేబినాయనకు మద్దతుగా ప్రచారంబేబినాయనకు మద్దతుగా పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, ఐటిఐ కాలనీలో జనసేన, టిడిపి ఆధ్వర్య ంలో సైకిల్‌ ర్యాలీ చేశారు. జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, మండల అధ్యక్షులు ఎస్‌.గంగాధర్‌, టిడిపి నాయకులు పాల్గొన్నారు. బేబినా యనను గెలిపించాలని వికలాంగుల సంక్షేమ నాయకులు సిహెచ్‌ రాంబాబు, సభ్యులు పట్టణంలో ప్రచారం చేశారు. ట్రైసైకిళ్లపై వీధుల్లో పర్యటించి బేబినాయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.బాడంగి: మండలంలోని కోడూరు పంచాయతీ గొల్లలపేట గ్రామంలో ఆదివారం బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమాన్ని టిడిపి బీసీ సాధికారిత జిల్లా కన్వీనర్‌ కొల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు, సంక్షేమ కోసం, యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం బాబును మళ్లీ రప్పిద్దామని పిలుపునిచ్చారు. వైసిపి ఐదేళ్ల అరాచక పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి మరిపె రమేష్‌, టిడిపి మండల ఉపాధ్యక్షుడు లచ్చుపతుల సత్యం, కోడూరు యువజన విభాగం అధ్యక్షుడు కొల్లి అప్పలనాయుడు (ఎల్‌ఐసి), కోడూరు బూత్‌ ఇన్‌చార్జి వెన్నెల గణేష్‌, కోడూరు గ్రామ టిడిపి అధ్యక్షుడు కొల్లి సత్యారావు, పార్టీ నాయకులు ఇప్పిలి రమేష్‌, పాల్గొన్నారు.

➡️